వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్..
- April 17, 2021
మీకు ప్రైజ్ మనీ వచ్చింది ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి... వ్యాక్సిన్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ ఇటీవల కొన్ని ఫేక్ లింక్ లు వాట్సాప్ లో హల్ చల్ చేస్తున్నాయి.ఈ లింక్ పై క్లిక్ చేసి మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు. అయితే తాజాగా వాట్సాప్ లో మరో ఫేక్ లింక్ షేర్ అవుతోంది. వాట్సాప్ పేరు చెప్పే వాట్సాప్ వినియోగదారులను మోసం చేస్తున్నారు కొందరు సైబర్ కేటుగాళ్లు. సాధారణంగా కనిపించే ఆకుపచ్చ రంగులో కాకుండా కొత్త రంగులో వాట్సాప్ వచ్చేసిందంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు. ఆ కొత్త రంగు వాట్సాప్ ఎలా ఉంటుందో చూద్దామంటూ క్లిక్ చేసిన కొందరు అడ్డంగా బుక్ అవుతున్నారు. అచ్చంగా వాట్సాప్ లాగా నమ్మించేలా ఉండే ఆ లింక్ మీకు వస్తే ఆ లింక్ పై క్లిక్ చేయకండి. ఒక వేళ క్లిక్ చేస్తే మీ పేరు, మొబైల్ నెంబరు తదితర వివరాలు ఎంటర్ చేయాలని అడుతగుతుంది. ఒక వేళ మీరు ఆ వివరాలను నమోదు చేస్తే అనంతరం ఆ పేజీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఇంతటితో అయిపోతుంది అనుకుంటే పొరపాటే.
మీరు నమోదు చేసిన సమాచారం మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో పాటు మీ మొబైల్ లో ఉన్న మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా వారి చేతుల్లోకి వేళ్ల ప్రమాదం ఉంటుంది. ఆ లింక్ పై మీరు క్లిక్ చేసిన అనంతరం మీకు తెలియకుండానే మీ ఫోన్లో ఉన్న అందరు కాంటాక్టులకు ఆ లింక్ వెళ్లి పోతుంది. మీరు చేసే ఈ చిన్న మిస్టేక్ ద్వారా వారు కూడా మోస పోయే ప్రమాదం ఏర్పడుతుంది. మీరు సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూపులకు కూడా ఆ లింక్ మీకు సంబంధం లేకుండానే వెళ్లి పోతుంది.
వాట్సాప్ అప్ డేట్ ఇలా..
వాట్సాప్ లో కొత్త ఫీజర్లు ఏమైనా వస్తే వాట్సాప్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడిస్తుంది. యాప్ ద్వారా మనకు నోటిఫికేషన్లను కూడా పంపిస్తుంది.ప్లే స్టోర్/ యాప్ స్టోర్ ద్వారా మనం యాప్ ను అప్ డేట్ చేసుకుంటే కొత్త ఫీజర్లు మనకు అందుబాటులోకి వస్తాయి. ఒక వేల అగంతకుల నుంచి వచ్చే ఫేక్ లింక్ లు, ఏపీకే ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకుని వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలనుకుంటే అంతే సంగతులు. అలాంటి సందర్భాల్లో వాట్సాప్ అప్ డేట్ కాక పోగా మీరు సైబర్ కేటుగాళ్ల చేతిలో మోస పోతారు.
ఇప్పటికే లింక్ పై క్లిక్ చేస్తే..
ఒక వేళ ఇప్పటికే క్లిక్ చేసి ఉంటే నష్ట నివారణకు మీకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం మీ ఫోన్‌ను రీసెట్ చేస్తే బెటరని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్లు, మెయిల్ ఐడీలకు సంబంధించిన పాస్ వర్డ్ లను కూడా మార్చుకుంటే మంచిదని చెబుతున్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







