మస్కట్ - సలాలా బస్ సర్వీసుల రద్దు

- April 17, 2021 , by Maagulf
మస్కట్ - సలాలా బస్ సర్వీసుల రద్దు

మస్కట్: ప్రజా రవాణా సంస్థ మవసలాట్, రూట్ 100 (మస్కట్ - సలాలా)ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 17 నుంచి తదుపరి నోటీసువరకు ఈ రద్దు అమల్లో వుంటుంది. సుప్రీం కమిటీ, పలు వ్యాపార కార్యకలాపాల్ని శుక్రవారం నుంచి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దోఫార్ గవర్నరేట్ పరిధిలో రాత్రి 6 నుంచి ఉదయం 5 గంటల వరకు వ్యక్తులు లేదా వాహనాల రాకపోకలపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com