'థ్యాంక్యూ బ్రదర్' రిలీజ్ పోస్టర్ విడుదల చేసిన నాగచైతన్య
- April 17, 2021హైదరాబాద్: అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ జంటగా రమేశ్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్న 'థ్యాంక్యూ బ్రదర్' రిలీజ్ పోస్టర్ ను అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తి కరంగా ఉందని, కొత్త కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా పట్ల తానెంతో ఆకర్షితుడైనట్లు చెబుతూ ఈ నెల 30న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానున్నట్టు తెలిపాడు చైతు. ఈ సినిమా ద్వారా దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్న రమేశ్ రాపర్తికి సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపాడు చైతన్య. ఇక ఈ సినిమాకు గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందిస్తుండగా సురేశ్ రఘుతు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు. అర్చన, వైవా హర్ష, అనీశ్ కురువిలా, అన్నపూర్ణ, మౌనికా రెడ్డి, ఆదర్శ్, కాదంబరి కిరణ్, సమీర్ ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రధారులు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు