భారత్ లో కరోనా విజృంభణ

- April 19, 2021 , by Maagulf
భారత్ లో కరోనా విజృంభణ

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా రోజు రోజుకి విజృంభిస్తోంది.తొలి వేవ్ భ‌య‌పెడితే.. సెకండ్ వేవ్‌లో భ‌యం త‌గ్గినా.. కేసులు మాత్రం డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి.ఇప్ప‌టికే రెండు ల‌క్ష‌ల మార్క్‌ను దాటేసిన రోజువారీ కేసులు.. ఇప్పుడు మూడు ల‌క్ష‌ల వైపు ప‌రుగులు తీస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 2,73,810 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.1,619 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు.ఇదే స‌మ‌యంలో 1,44,178 మంది క‌రోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నార‌ని కేంద్రం పేర్కొంది.. దీంతో.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,50,61,919కు చేరుకోగా.. యాక్టివ్ కేసులు 19,29,329గా ఉన్నాయి.. ఇక, ఇప్ప‌టి వ‌ర‌కు 1,29,53,821 మంది రిక‌వ‌రీ అయితే.. 1,78,769 మంది ప్రాణాలు కోల్పోయారు.మ‌రోవైపు.. ఇప్ప‌టి వ‌ర‌కు 12,38,52,566 మంది వ్యాక్సినేష‌న్ పూర్తి చేసిన‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com