దొంగ లింకులతో దోచేస్తారు!
- April 19, 2021
- వాట్సప్ పింక్లుక్ పేరుతో మాయాజాలం
- అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ల పేరిట ఎర
‘మీ ఫోన్లో వాట్సప్‌ను అప్డేట్ చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. పింక్ లుక్‌తో కొత్త ఫీచర్లను ఆస్వాదించండి..’
‘అమెజాన్ ప్రైమ్ అద్భుతమైన ఆఫర్.. ఉచితంగా పొందాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి..’
‘సినిమాలు, సిరీస్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లు మీ మొబైల్లోనే హెచ్డీ నాణ్యతతో వీక్షించండి.. ఉచితంగా ప్రత్యక్ష ప్రసారాల కోసం ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి..’
ప్రస్తుతం ఫోన్లు, వాట్సప్ గ్రూపుల్లో ప్రత్యక్షమవుతున్న సంక్షిప్త సందేశాలివి. వీటితోపాటు వచ్చే లింక్‌ను పొరపాటున క్లిక్ చేస్తే చాలు ఫోన్లోకి వైరస్ ప్రవేశిస్తోంది.వెంటనే సదరు ఫోన్ సైబర్ నేరస్థుల స్వాధీనంలోకి వెళ్లిపోతోంది.సైబర్ నేరస్థులు ఆయా సంస్థల పేర్లను వినియోగించుకొని లింకుల్ని పంపిస్తున్నారు.పొరపాటున దానిని క్లిక్ చేస్తే స్పామ్ రూపంలో వైరస్లు ఫోన్లోకి చొరబడుతున్నాయి. డేటా చోరీకి గురవుతోంది.ఫోన్లో రహస్య సమాచారమేదైనా ఉంటే వాటిని చూపి బెదిరింపులకు పాల్పడుతున్నారు.డబ్బులనూ డిమాండ్ చేస్తున్నారు.లింక్‌ల్ని తెరవగానే ‘ఆన్లైన్ స్ట్రీమ్’కు అనుమతి ఇవ్వాలని నేరగాళ్లు అడుగుతున్నారు.అనుమతి ఇస్తే దాని ఆధారంగా నేరస్థులు బల్క్‌గా లింక్‌ల్ని మనకు ప్రమేయం లేకుండానే మన ఫోన్లోని కాంటాక్టులకు పంపేస్తారు. వారూ వాటిని తెరుస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







