వచ్చే నవంబరులో యూఏఈ బెలూన్ ఫ్లాగ్ ప్రారంభం
- April 19, 2021
యూఏఈ: యూఏఈ బెలూన్ టీమ్, ‘యూఏఈ ఫ్లాగ్ బెలూన్’ ప్రారంభానికి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టింది. అబుదాబీ నుంచి ప్రారంభించి రీజినల్ అలాగే గ్లోబల్ టూర్లను బెలూన్ నిర్వహించనుంది. ఈ టీమ్ ప్రస్తుతం తమ వెబ్ సైట్ తయారీలో నిమగ్నమైంది. ‘ది వరల్డ్ విల్ నాట్ ఫర్గెట్ యు జాయెద్’ పేరుతో 18 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఫౌండర్ ఫాదర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కెప్టెన్ పైలట్ అబ్దుల్ అజీజ్ నాజర్ అల్ మన్సూరి (యూఏఈ బెలూన్ టీమ్ ప్రెసిడెంట్), పలు రీజినల్ అలాగే ఇంటర్నేషనల్ బహుమతుల్ని పలువురు ప్రముఖుల నుంచి అందుకున్నారు. పలు అరబ్ దేశాలు అలాగే ఇజ్రాయెల్, సుడాన్ మరియు మొరాకో వంటి దేశాల మీదుగా బెలూన్ టూర్ నడుస్తుందని యూఏఈ బెలూన్ టెక్నికల్ సూపర్వైజర్ కెప్టెన్ రసెల్ క్లాక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







