రమదాన్ నేపథ్యంలో ఫుడ్, షిషా నిబంధనలపై స్పష్టతనిచ్చిన దుబాయ్
- April 20, 2021
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో ఫాస్టింగ్ సమయాల్లో బహిరంగంగా షిషా, ఫుడ్ విక్రయాలు జరపకూడదని రెస్టారెంట్లు అలాగే షిషా నిర్వాహకులకు స్పష్టం చేశాయి అథారిటీస్. అయితే, వినియోగదారులకు ఫుడ్ డెలివరీస్ మాత్రం చేయవచ్చు. ఔట్ డోర్ ఏరియాస్ విషయానికొస్తే, ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి వుంటుంది. ఉపవాస సమయాల్లో వీటిని నిర్వహించకూడదు. ఉదయం 4.20 నిమిషాల నుంచి సాయంత్రం 6.45 నిమిషాల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్, షిషా వంటివాటికి అనుమతి లేదు. రెస్టారెంట్లు వినియోగదారులకు ఫుడ్ సర్వింగ్ కోసం ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదని దుబాయ్ ఎకానమీ ఇటీవలి సర్క్యులర్ ద్వారా పేర్కొనడం జరిగింది. ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు స్క్రీన్లు వినియోగించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. గతంలో, స్క్రీన్లు వినియోగించడం తప్పనిసరి. అటువైపుగా వెళ్ళేవారికి ఇది ఇబ్బందికరంగా మారకూడదనే కోణంలో గతంలో స్క్రీన్ల వినియోగాన్ని తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?







