పూర్తి లాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం

- April 20, 2021 , by Maagulf
పూర్తి లాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబై:  భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.మహారాష్ట్రలో రోజుకు 60 వేల నుంచి 70 వేల కొత్త కరోనా కేసులు నమోదవడం అక్కడి వారికి భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా కల్లోలం అరికట్టాలంటే.. లాక్ డౌన్ తప్పనిసరి అని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అభిప్రాయపడ్డారు.అజిత్ పవార్ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం నియమ నిబంధనలు మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది అత్యవసర సేవల్లో పాల్గొంటున్నారు. ఈ సంఖ్యను తగ్గించాలని అజిత్ పవార్ సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. దీంతో అత్యవసర సేవల జాబితాలో ఉన్న కిరాణా దుకాణాలు తెరవడానికి ఇచ్చిన సమయాన్ని తగ్గించే యోచనలో ఉంది.  ఏప్రిల్ 21 న రాత్రి 8 గంటల నుంచి మొత్తం లాక్ డౌన్ విధించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అందరు మంత్రులు ఒక అభ్యర్థనను సమర్పించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. రేపు రాత్రి 8 గంటల నుండి రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ ప్రకటించాలని మేము సిఎంను అభ్యర్థించాము. ఇది మంత్రులందరూ సిఎంకు చేసిన అభ్యర్థన, ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తోపే చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com