లాక్‌డౌన్‌ పై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ

- April 20, 2021 , by Maagulf
లాక్‌డౌన్‌ పై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: క‌రోనా రెండో వేవ్ విరుచుకుప‌డుతోన్న స‌మ‌యంలో జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కరోనా రెండో వేవ్ లో ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై ఆయన మాట్లాడారు.మనం ఇపుడు క‌రోనా రెండో వేవ్ ఎదుర్కొంటున్నాము. మీరు అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకున్నాను. లాక్ డౌన్ లను చివరి అస్త్రంగా మాత్రమే చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను..అని ప్రధాని మోదీ  అన్నారు. దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ధైర్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని చెప్పారు. అంతకు మందు అయన మాట్లాడుతూ దేశం నలుమూలలా ఆక్సిజన్‌ కొరత ఉందని మోదీ అన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి సరఫరా కోసం అనేక చర్యలు తీసుకున్నామని, అనేక ప్లాంట్లు నెలకొల్పామని గుర్తు చేశారు. వైద్య అవసరాల కోసం ఔషధాల ఉత్పత్తి పెంచామని , ఫార్మా పరిశ్రమలు త్వరిత గతిన మెరుగైన వ్యాక్సిన్లు అందిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టామని చెప్పిన ప్రధాని మోదీ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, వయోవృద్ధులకు టీకాలు వేశామన్నారు.అందరూ జాగ్రత్తగా ఉండాలని మోదీ ప్రజలకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com