కొత్త విధానంలో పార్కింగ్ ఫీజు చెల్లింపుపై డబ్బు ఆదా
- April 21, 2021దుబాయ్: డిజిటల్ విధానంలో పార్కింగ్ ఫీజు చెల్లించి డబ్బు ఆదా చేసుకోవచ్చని దుబాయ్ ఆర్టీఏ వెల్లడించింది. ఇందుకోసం యాప్ క్లిప్స్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే..ఇది కేవలం ఐఫోన్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు...యాప్ క్లిప్స్ ను ప్రత్యేకంగా ఫోన్ లో ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్టీఏ దుబాయ్ యాప్ లోనే అంతర్గతంగా యాప్ క్లిప్స్ ఉంటుంది. పబ్లిక్ పార్కింగ్, సైన్ బోర్డులపై ఉన్న క్యూఆర్ కోడ్ ను ఐఫోన్ తో స్కాన్ చేయగానే ఐఫోన్ పేకి రిడైరెక్ట్ అవుతుంది. ఆ వెంటనే పార్కింగ్ ఫీజు చెల్లించవచ్చు.దీంతో ఒకసారి చెల్లింపుపై 30 ఫిలాను ఆదా చేసుకోవచ్చని ఆర్టీఏ స్పష్టం చేసింది. ప్రస్తుతం 70 శాతం పార్కింగ్ ప్రాంతాలు, సైన్ బోర్డుల దగ్గర క్యూఆర్ కోడ్ లు ఉన్నాయని...త్వరలోనే అన్ని ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?