కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

- April 21, 2021 , by Maagulf
కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

తెలంగాణ: భద్రాద్రి రాముడి కల్యాణం కన్నుల పండువగా సాగింది.ఏటా మిథిలా స్టేడియంలో నిర్వహించే రామయ్య కల్యాణాన్ని కరోనా కారణంగా నిత్యకల్యాణ మండపంలో జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రే ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు.భక్త రామదాసు స్వయంగా చేయించిన దివ్యాభరణాలను సీతారాముల స్వర్ణ మూర్తులను అందంగా అలంకరించారు.శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులను పల్లకిపై కొలువుదీర్చి.. ఆలయ ప్రాంగణంలో బేడా మండపంలో రామచంద్రమూర్తి, సీతమ్మలను అభిముఖంగా కూర్చోబెట్టారు. కొందరు అర్చకులు రామయ్య తరపున, మరికొందరు అర్చక స్వాములు సీతమ్మవారి తరపున ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు.ఈ సమయంలో అయోధ్య నుంచి రాముడు, మిథిల నుంచి సీతమ్మ తల్లి వచ్చినట్లుగా వర్ణించారు. ఆ తరువాత మంగళ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ మాలా పరివర్తన కార్యక్రమాన్ని రమణీయంగా పూర్తిచేశారు.అనంతరం సీతారామచంద్రులను పక్క పక్కన ఆశీనులను చేసి ప్రత్యేక హారతి సమర్పించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com