కేటీఆర్ కు కరోనా పాజిటివ్..

కేటీఆర్ కు కరోనా పాజిటివ్..

హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది.ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి.ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది.అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది.తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు కరోనా నిర్ధారణ అయింది.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే.. ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.కరోనా లక్షణాలు కాస్త  తనకు ఉన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం తాను.. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.తనను ఈ మధ్య కలిసిన నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.కాగా ఇప్పటికే తెలంగాణ సిఎం కెసిఆర్,ఎంపీ సంతోష్ కుమార్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.అటు టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు కరోనా బారిన పడటంతో నేతల్లోనూ ఆందోళన మొదలైంది.  

Back to Top