నడిరోడ్డుపై కారు రేసింగ్‌లు..ముగ్గురు అరెస్ట్
- April 23, 2021యూఏఈ: అర్ధరాత్రి వేళ రోడ్లపై కార్లతో స్టంట్లు చేస్తున్న ముగ్గురు బరితెగింపు యువకులను అబుధాబి పోలీసులు అరెస్ట్ చేశారు. తోటి స్నేహితులను వెంటబెట్టుకొని వారు చూస్తుండగా...ఈ ముగ్గురు యువకులు అతి వేగంగా కార్లను నడుపుతూ స్టంట్లు నిర్వహిస్తున్నారని...నివాస ప్రాంతాలతో పాటు...హైవేపై కూడా వారి ప్రమాదకర విన్యాసాలు కొనసాగాయని పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజాము వరకు విన్యాసాలను కొనసాగించారని అన్నారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను సహించబోమని పోలీసులు హెచ్చరించారు. కారుతో డేంజరస్ స్టంట్లు చేసిన ముగ్గురు వ్యక్తులతో పాటు వారి విన్యాసాలను చూసేందుకు వెళ్లిన యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించటంతో పాటు రోడ్డుపై ఇతర వాహనదారుల ప్రాణాలకు హని కలిగించేలా వ్యవహరించిన యువకులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్