ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
- April 23, 2021
అమరావతి: ఏపీలో కూడా కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.రోజువారి పాజిటివ్ కేసులు పది వేలలు దాటిపోయాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 45,581 శాంపిల్స్ పరీక్షించగా 11,766 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 36 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.. కోవిడ్ బారిన పడి కోవిడ్ వల్ల నెల్లూరు లో ఆరుగురు, చిత్తూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, కృష్ణ లో నలుగురు, కర్నూల్ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నం లో ముగ్గురు, గుంటూరు మరియు విజయనగరం లలో ఇద్దరు చొప్పున మరణించారు.ఇదే సమయంలో 4,441 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1009228కు చేరగా.. యాక్టివ్ కేసులు 74,231 గా ఉన్నాయి.ఇక, ఇప్పటి వరకు 927418 కరోనా నుంచి కోలుకోగా 7,579 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!







