ఊహించని మేకోవర్ తో కార్తీ ఇంట్రెస్టింగ్ సినిమా.!
- April 25, 2021కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీ సినిమాకు మన దగ్గర కూడా మంచి ఆదరణ ఉంది. సూర్య తర్వాత కార్తీ సినిమాలు మన దగ్గర బాగానే చూస్తారు. మరి అందుకు తగ్గట్టుగానే కార్తీ కూడా ఎప్పటికప్పుడు వైవిధ్యభరిత సబ్జెక్టులను తీసుకొస్తూ ఉంటాడు. అయితే ఈసారి రొటీన్ మసాలా డ్రామా “సుల్తాన్” తో వచ్చిన కార్తీ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసాడు.
మరి ఈసారి మాత్రం పూర్తిగా డిఫరెంట్ సబ్జెక్టుతో వస్తున్నట్టు అనిపిస్తుంది. దర్శకుడు పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో “సర్దార్” అనే సరికొత్త కథతో వస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ఇప్పుడు విడుదల చేశారు. అయితే ఇంట్రెస్టింగ్ గా కట్ చేసిన ఈ మోషన్ పోస్టర్ టీజర్ ప్రామిసింగ్ గా ఉంది.
దాని నుంచి రివీల్ చేస్తూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కార్తీ కనిపించాడు. ఇలాంటి రోల్ లో ఇది వరకు కార్తీ కనిపించింది లేదు. దీనితో ఇది కాస్త కొంత కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రం తమిళ్ మరియు తెలుగులో వస్తోంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ప్రిన్స్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..