కోవిడ్‌పై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష..
- April 25, 2021
హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ కేసులు తెలంగాణలో క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.మరో వైపు మృతుల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.దీంతో.. ఇవాళ అన్ని జిల్లాల వైద్య అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. కోవిడ్ బారినపడిన వారి ప్రాణాలుపోకుండా చూడడమే మనందరి లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.దీనిపై కీలక సూచనలు చూశారు మంత్రి ఈటల.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనేక రకాల ఒత్తిడిలో పని చేస్తున్నారన్న ఆయన.. కుటుంబాలను వదిలి పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.. అయితే, కోవిడ్ బారినపడినవారి ప్రాణాలు కాపాడడం ఎలా అనేదానిపై మాట్లాడుతూ.. పాజిటివ్ వచ్చిన వారు ఎక్కువ మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీరు ఇంట్లో నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర శ్వాస కోశ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. కాబట్టి కరోనా వచ్చి ఇంట్లో ఉన్న ప్రతీ ఒక్కరినీ ఆశా వర్కర్లు రోజుకు రెండు సార్లు ఆక్సిజన్ లెవెల్స్, జ్వరం పరీక్ష చేయాలన్నారు.. అలా చేసినప్పుడే ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతాం అన్నారు ఈటల.
గతానికి భిన్నంగా ఈ సారి ఇంట్లో ఒక్కరికి వస్తే మిగతా వారి అందరికీ వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. దానిని నివారించేందుకు ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరికీ ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు మంత్రి ఈటల రాజేందర్.. అలాగే వైరస్ సోకిన వారికి రక్త పరీక్షలు చేయడం వల్ల వైరస్ తీవ్రత ఎంత ఉందో తెలుస్తుంది. దానిని బట్టి పెద్దాసుపత్రి కి పంపించాలని సూచించిన ఆయన.. టెస్టింగ్ కిట్స్ మరిన్ని అందుబాటులోకి తీసుకు రావాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాశాను.. మరిన్ని కిట్స్ అందిస్తాం అన్నారు.. లక్షణాలు ఉన్న వారు ఏ ప్రాంతం వారు వచ్చినా పరీక్షలు చెయ్యాలని.. ప్రైవేట్ లో పరీక్షలు చేసుకుని పాజిటివ్ వచ్చిన వారందరి వివరాలు కూడా వైద్య ఆరోగ్య శాఖకి అందాలి, వారికి కూడా హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని ఆదేశించారు. టెలీ మెడిసిన్ ద్వారా అనుమానాలు నివృత్తి చేయాలన్న ఆరోగ్యశాఖ మంత్రి.. IMA వారు కూడా ముందుకు వచ్చారు వారి సేవలు కూడా వినియోగించుకుంటామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ లో పేషెంట్లకు ఇస్తున్న చికిత్స ను పర్యవేక్షించండి.. ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి ఆక్సిజన్ అవసరం అయితే అందించే ప్రయత్నం కూడా చేద్దామని అధికారులకు సూచించారు. ఇక, గత వారం రోజులుగా కేసుల పెరుగుదల తీవ్రంగా లేదు.. వ్యాప్తి తగ్గుతుంది అని ఆశిస్తున్నాం అన్న ఆయన.. వైద్య ఆరోగ్య శాఖ లో ఏం అవసరం ఉంటే అవి అన్నీ సమకూర్చుకోండి.డాక్టర్స్, సిబ్బంది అవసరం ఉంటే వెంటనే నియామకం చేసుకోవాలని మరో సారి ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు. వైద్యాధికారులకు వెహికల్ అలోవెన్స్ అందేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించిన మంత్రి.. రెండీస్వీర్ అందరికీ అవసరం ఉండదు. ఐసీఎంఆర్ నిభందనలు మేరకే అందించేలా హాస్పిటల్స్ కి ఆదేశాలు జారీ చేయాలన్నారు.. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి అని కోరిన మంత్రి.. కరోనా లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్షలతో సంబంధం లేకుండానే చికిత్స మొదలు పెట్టాలని..అర్బన్ PHC, బస్తి దావాఖనాలు, GHMC ఏరియాలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఎక్కువ మందిని నియమించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!