భారత్ కు కువైట్ సాయం..ఆక్సిజన్ సిలిండర్లు పంపించాలని నిర్ణయం
- April 27, 2021
కువైట్: రోజుకు లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ కు బాసటగా నిలవాలని కువైట్ తీర్మానించింది. కోవిడ్ కొత్త వేరియంట్ వైరస్ తో అల్లాడుతున్న ప్రజలకు తమ వంతు సాయంగా ఆక్సిజన్ సిలిండర్లను పంపించాలని కువైట్ మంత్రిమండలి నిర్ణయించింది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరగటం..ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకోవటంతో చాలా మంది ప్రాణాలు కొల్పోతున్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులు చూస్తే ఆందోళనకర వాతావరణం నెలకొంది. దీనిపై చలించిన కువైట్ మంత్రి మండలి ఆక్సిజన్ సిలిండర్ లను పంపటం ద్వారా భారత్ కు మద్దతుగా నిలబడాలని తీర్మానించింది. కువైట్-భారత్ మధ్య స్నేహన్ని మరింత బలపర్చుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో, వ్యాక్సిన్ విషయంలోనూ భారత్ తమకు మద్దతుగా నిలబడిన విషయాన్ని గుర్తు చేసుకుంది.
తాజా వార్తలు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!









