భారత్ సెకండ్ వేవ్: 'స్ట్రైక్ టీం' ను రంగంలోకి దింపుతున్న పెద్దన్న
- April 27, 2021
సొంత పార్టీ నేతల పాటు ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో భారత్ కు సాయం చేసే విషయంపై అమెరికా మెట్టు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఫోన్ లో మాట్లాడారు. తాజాగా అమెరికా ఎలాంటి సాయం చేయబోతోందన్న దానిపై మంగళవారం వైట్ హౌస్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా ‘స్ట్రైక్ టీం’ను ఇండియాకు పంపిస్తున్నట్టు చెప్పారు.
ఆ బృందంలోప్రజారోగ్య నిపుణులు ఉంటారని శ్వేత సౌధపు అధికారి చెప్పారు. స్ట్రైక్ టీంను ఇండియాకు పంపించడం కోసం యూఎస్ఏఐడీ, అమెరికా సీడీసీ సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. భారత ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య సిబ్బందితో కలిసి పనిచేసేందుకు ఇప్పటికే తమ ఎంబసీ అధికారులను సంప్రదించినట్టు చెప్పారు.
లేబొరేటరీ సేవలు, నిఘా, ఎపిడెమియాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, కరోనా వైరస్ జన్యు క్రమ నిర్ధారణ, వ్యాధి కరోనాతో కకావికలం.. ఇండియాలో దిగననున్న అమెరికా ‘‘ స్ట్రైక్ టీం’’ సాయపడగలదని సదరు అధికారి అభిప్రాయపడ్డారు.
భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్.. కొవిషీల్డ్ ఉత్పత్తి కోసం తగినంత ముడిసరుకును ఎగుమతి చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లో ఉన్న భయానక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలు ఇచ్చేందుకు, ఆక్సిజన్ సరఫరా చైన్ అభివృద్ధి కోసం ఇప్పటికేఅమెరికా రక్షణ శాఖ, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ లు పనిచేస్తున్నాయన్నారు.
ఆక్సిజన్ సిలిండర్ల కాంట్రాక్ట్ కు సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసుకుందని ఆఅధికారి పేర్కొన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లూ ఇచ్చే విషయంపైనా చర్చిస్తున్నట్లు తెలిపారు. భారత్ కోరిన అన్ని విభాగాల్లోనూ సిబ్బందికి శిక్షణనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను త్వరితగతిన పంపుతామని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు









