రూపాయికే నల్లా కనెక్షన్ పథకo అంశంపై పురపాలక శాఖ కసరత్తు
- March 03, 2016
గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్‌ను జారీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పురపాలనలో సంస్కరణల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి చేసిన సిఫారసుల్లో ఇది కూడా ఒకటి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఈ నెల 5న రాష్ట్రంలోని నగర, పురపాలికల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లతో సమీక్ష నిర్వహించనున్నారు.ఇందులో రూపాయికే నల్లా కనెక్షన్‌తోపాటు 100 రోజుల ప్రణాళిక, పురపాలికల ఆదాయ, వ్యయాలు, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, వేసవిలో తాగునీటి సరఫరా, మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులపై చర్చించనున్నారు.పురపాలికల్లో అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించడంతో పాటు నీటి చార్జీలను పకడ్బందీగా వసూలు చేసేందుకు రూపాయికే నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రకటించే అంశంపై పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. మేయర్ల సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ దీనిపై ప్రకటన చేయొచ్చు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







