ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
- May 02, 2021
అమరావతి: ఏపీలో ఈనెల 5 నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.హైకోర్టు సూచనల మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.త్వరలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది.
ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలన్న ఏపీ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
కోవిడ్ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే తయారు చేసినా కానీ 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటంతో ఈ విషయంలో జాతీయ విధానం అంటూ ఏదీ ప్రకటించకపోవటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించేశారని ఆయన తెలిపారు. మరికొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారని, మరికొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి పాస్ సర్టిఫికెట్ ఇస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







