వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ - మూడు కేటగిరీలు
- May 07, 2021
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ప్రక్రియును ఇమ్యూన్ యాప్ ద్వారా జారీ చేయనుంది. డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డిపార్టుమెంట్ - సెంటర్ ఫర్ టెక్నలాజికల్ అడ్వాన్సుమెంట్ - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇంజనీర్ అహ్మద్ అల్ ఘరిబ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు కేటగిరీల్లో సర్టిఫికెట్ జారీ చేస్తారు.
మొదటి కేటగిరీ: ఓ వ్యక్తి, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని వుండాలి.
రెండో కేటగిరీ: ఓ వ్యక్తి కరోనా బారిన పడి, 3 నుంచి 6 నెలల్లోపు మొదటి డోస్ వ్యాక్సిన్ పొందాలి.
మూడో కేటగిరీ: ఓ వ్యక్తి మొదటి డోస్ తీసుకుని, ఐదు వారాలు పూర్తి చేసుకోవాలి. అయితే, రెండో డోస్ పూర్తి చేసుకున్నాకే పూర్తి ఇమ్యూనిటీ లభించినట్లు. వ్యాక్సినేషన్ బ్యాచ్ నెంబర్ సహా అనేక వివరాలతో, ట్యాంపరింగ్ అవకాశమే లేకుండా ఈ సర్టిఫికెట్ రూపొందిస్తున్నారు.
అవసరమైనప్పుడు ఈ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, అథారిటీస్ ముందు చూపాలి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్‌కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్‌షాప్..!!









