ఖుబానీ కా మీఠా
- May 09, 2021
కావాల్సిన పదార్థాలు:
ఆప్రికాట్స్ (ఖుబానీ): ఒక కప్పు
చక్కెర: 3 టేబుల్‌స్పూన్స్
యాలకుల పొడి: ఒక టీస్పూన్
నిమ్మరసం: ఒక టీస్పూన్
తయారు చేయు విధానం:
ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆప్రికాట్స్ అందులో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయమే ఆప్రికాట్స్ తీసి బయట పెట్టి నీళ్లను అలాగే ఉంచాలి. ఇప్పుడు ఆప్రికాట్స్‌లోని గింజలను తీసి పక్కన పెట్టాలి. పక్కనపెట్టిన నీళ్లను ఆప్రికాట్‌లో పోయాలి. ఆప్రికాట్స్‌ను చిదిమేసి 25 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గరకి అయిపోతే మళ్లీ కొన్ని నీళ్లు పోయొచ్చు. ఇప్పుడు చక్కెర వేసి ఐదు నిమిషాల పాటు కలుపుతుండాలి. చివరగా యాలకులపొడి, నిమ్మరసం వేసి దించేయాలి. ఆప్రికాట్స్ గింజలతోనే గార్నిష్ చేసి వేడిగా లేదా చల్లగానైనా సర్వ్ చేయొచ్చు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







