భారత్-యూఏఈ చార్టర్ విమానాలకు కొత్త రూల్
- May 11, 2021
యూఏఈ: భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో చాల దేశాలు భారత ప్రయాణిలపై ఆంక్షలు విధించిన విషయం విదితమే.భారత్ నుంచి వెళ్లే విమానాలను నిషేధిస్తూ చాలా దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.ఆ దేశాల జాబితాలో యూఏఈ కూడా ఉంది. ఇక యూఏఈ తీసుకున్న ఈ అనుహ్య నిర్ణయం వల్ల వివిధ కారణాలతో స్వదేశానికి వచ్చిన వేలాది మంది ప్రవాసులు ఇక్కడే చిక్కుకుపోయారు. వారంతా తిరిగి యూఏఈ వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.తప్పని పరిస్థితుల్లో వీరు భారీ మొత్తంలో వెచ్చించి చార్టర్ విమానాల ద్వారా యూఏఈ వెళ్తున్నారు.
అయితే, తాజాగా ఇలా భారత్ నుంచి యూఏఈ వెళ్తున్న ఈ చార్టర్ విమానాలకు ఆ దేశ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(GCAA) కొత్త రూల్ అమలు చేస్తోంది.చార్టర్ విమానాలు ఎంత పెద్దవి అయినా సరే ఎనిమిది మంది కంటే ఎక్కువ ప్రయాణికులను తీసుకురావొద్దనే నిబంధనను GCAA పెట్టింది.దేశంలో వైరస్ వ్యాప్తి నివారణకు ఈ కొత్త రూల్ తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా GCAA అధికారులు వెల్లడించారు.అంతేగాక తక్షణమే ఈ రూల్ అమలులోకి వస్తుందని పేర్కొంది.ఇక ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రైవేట్ జేట్లకు డిమాండ్ పెరిగిపోయింది.దీంతో ప్రయాణికుల నుంచి చార్టర్ విమాన యాజమాన్యాలు 22,000 నుంచి 25,000 దిర్హాముల వరకు వసూల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









