కోవిడ్ రూల్ బ్రేక్..మాస్క్ ధరించని 356 మందిపై చర్యలు
- May 12, 2021
దోహా: కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించేది లేదని ఖతార్ అధికారులు మరోసారి హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవటం అంటే చట్టవిరుద్ధ చర్యలకు పల్పడుతున్నట్లేనని స్పష్టం చేసింది. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన ఖతార్ అధికారులు...తాజాగా మరో 388 మందిపై చర్యలు తీసుకుంది. ఇందులో 356 మంది ఫేస్ మాస్క్ ధరించలేదని, మరో 31 మంది భౌతిక దూరం పాటించలేదని వెల్లడించింది. హెతెరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోని ఓ వ్యక్తితో పాటు మొత్తం 388 మందిపై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించింది. కోవిడ్ నిబంధనలు పాటించని వాళ్లందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వేల కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!









