ఓసీఐ కార్డుల విషయంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఇండియన్ కాన్సులేట్

- May 14, 2021 , by Maagulf
ఓసీఐ కార్డుల విషయంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఇండియన్ కాన్సులేట్

దుబాయ్: దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, భారత పౌరులకు కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఓసిఐ కార్డుల రీ-ఇష్యూయెన్స్ విషయమై మార్గదర్శకాల్ని జారీ చేయడం జరిగింది. ఓసిఐ కార్డులు కలిగినవారికి కొత్త ఫారిన్ పాస్ పోర్టుల్ని జారీ చేయడానికి సంబంధించి ప్రకటన చేశారు.20 ఏళ్ళ వయసు వరకు వారికి కొత్త పాస్ పోర్టు జారీ చేసిన ప్రతిసారీ ఓసీఐ రీ-ఇష్యూయెన్స్ అవసరం వుండదనీ, 50 ఏళ్ళు పైబడినవారికి మాత్రం ఓసారి జారీ చేయడం జరుగుతందని నోటీసులో పేర్కొన్నారు.20 ఏళ్ళు పూర్తయినవారికి ఇచ్చే కొత్త పాస్ పోర్టు సమయంలోనే కొత్త ఓసీఐ కార్డు అవసరం వుంటుంది.ఫారిన్ భాగస్వామి లేదా విదేశీ మూలాలున్న భాగస్వామి విషయంలో కూడా పై నిబంధనలే వర్తిస్తాయి.పెళ్ళికి సంబంధించిన సర్టిఫికెట్ జత చేయవలసిన అవసరం వుంటుంది.మార్పులు చేర్పుల సమయంలో సంబంధిత పత్రాలు తప్పనిసరి. ఈ సర్వీసు ఉచితంగానే లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com