44 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు

- May 14, 2021 , by Maagulf
44 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు

మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం వుంది. కాగా, దోఫార్ గవర్నరేట్ పరిధిలో వర్షం కురిసే అవకాశం వుందని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది. ఆకాశం సాధారణంగానే వుంటుందనీ, కొన్ని చోట్ల మేఘాలు కనిపిస్తాయని ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్ హజార్ మౌంటెయిన్స్ అలాగే కొన్ని ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా కనిపిస్తాయి. కోస్టల్ ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితులు సాధారణంగానే వుంటాయి. విలాయత్ ఆఫ్ సీబ్ మరియు అదామ్ ప్రాంతాల్లో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జబాల్ షమ్హాన్ ప్రాంతంలో అత్యల్పంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com