కోవిడ్ రూల్స్ బ్రేక్..మూడు మసీదుల మూసివేత
- May 15, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజధాని గవర్నరేట్ పరిధిలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించటంతో మూడు మసీదులను తాత్కాలికంగా మూసివేశారు. ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల సందర్భంలో ఈ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించారు. దీంతో కోవిడ్ నిరోధక జాతీయ టాస్క్‌ఫోర్స్ సమన్వయంతో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మసీదులను రెండు వారాల పాటు మూసివేయాలని నిర్ణయించింది. పూర్తిగా శానిటైజ్ చేసి రెండు వారాల తర్వాత యథావిధిగా భక్తులను అనుమతిస్తారు. మరోవైపు మహమ్మారి నుంచి తమతో పాటు తోటి వారిని రక్షించుకునేందుకు ప్రజలంతా బాధ్యతగా మసలుకోవాలని, మతపరమైన అంశాల్లోనూ ఆరోగ్య సూత్రాలను మరిచిపోవద్దని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









