నెలలో పూర్తి స్థాయిలో విమానాశ్రయాలను తెరిచే యోచనలో కువైట్

- May 16, 2021 , by Maagulf
నెలలో పూర్తి స్థాయిలో విమానాశ్రయాలను తెరిచే యోచనలో కువైట్

కువైట్ సిటీ: కోవిడ్ తీవ్రత స్థిరంగా తగ్గుతూ వస్తుండటంతో ఆంక్షల సడలింపులపై కువైట్ సమీక్షించుకుంటుంది. అన్ని అనుకూలంగా ఉంటే ఓ నెల రోజుల్లోనే విమానాశ్రయాలు, ఓడరేవులను మళ్లీ ఆపరేట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు ఉప ప్రధాని, సుప్రీం కమిటీ ఛైర్మన్ షేక్ హమద్ జబెర్ అల్ అలీ స్పష్టం చేశారు.దేశ ప్రజలు, ప్రవాసీయుల చైతన్యంతో కొన్నాళ్లుగా కోవిడ్ తీవ్రతలో తగ్గుదల నమోదవుతోందని ఆయన అన్నారు.రాబోయే రోజుల్లో కూడా ఇదే తీరు ఉంటే చాలా వరకు ఆంక్షలను సడలించే అవకాశాలు లేకపోలేదని సూచనప్రాయంగా తెలిపారు. అయితే..ఏయే రంగాలకు సడలింపులు ఇవ్వబోయేది వచ్చే వారం జరగబోయే సమావేశంలో ఆరోగ్యమంత్రిత్వ శాఖతో ఇతర మంత్రి మండలితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com