ట్యాక్సీల్లో క్యాష్ లెస్ చెల్లింపులు నేటి నుంచి ప్రారంభం

- May 16, 2021 , by Maagulf
ట్యాక్సీల్లో క్యాష్ లెస్ చెల్లింపులు నేటి నుంచి ప్రారంభం

యూఏఈ: యూఏఈలోని ట్యాక్సీలో ప్రయాణించే వారు నేటి నుంచి క్యాష్ లెస్ చెల్లింపులు నిర్వహించవచ్చు. ఈ మేరకు మున్సిపాలిటీస్, రవాణా శాఖ విభాగంలోని సమీకృత రవాణా కేంద్రం నగదు రహిత చెల్లింపులకు సంబంధించి సూచనలు చేసింది. ట్యాక్సీ ప్రయాణికులు పేబై యాప్ ద్వారా  మే 16 నుంచి డబ్బులు చెల్లించొచ్చని ప్రకటించింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ కార్డులను పేబై అకౌంట్ కు యాడ్ చేసుకోవటం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. క్రెడిట్ కార్డులు లేని వారు తమ బ్యాంక్ కార్డుల ద్వారా పేబై వాలెట్ కు డబ్బులు పంపించి వాలెట్ తో ట్యాక్సీ ఛార్జ్ లను చెల్లించొచ్చు. లేదంటే కియోస్క్ ద్వారా నగదును పేబై వ్యాలెట్ లో జమ చేసి కూడా ట్యాక్సీ ఛార్జ్ లను యాప్ ద్వారా చెల్లించొచ్చని అధికారులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com