తెలంగాణకు ఆక్సిజన్ సాయం అందించిన గ్రీన్ కో సంస్థ
- May 16, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది.
ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి కేటీఆర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అనిల్ చలమలశెట్టి ప్రభుత్వానికి అందజేశారు.
_1621153277.jpg)
గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించినందుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమయంలో కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని, అయితే ఇప్పుడు అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సెంట్రేటర్ల లను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









