యూఏఈలో ఎండల తీవ్రత 49 డిగ్రీస్‌

- June 01, 2015 , by Maagulf
యూఏఈలో ఎండల తీవ్రత 49 డిగ్రీస్‌

యూఏఈలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం ఉష్ణోగ్రతలు 45 నుంచి 49 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ అండ్‌ సెస్మాలజీ వెల్లడించింది. ప్రధానంగా యూఏఈలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. వేడితో కూడిన బలమైన గాలులు వీస్తాయనీ, ఇసుక తుఫాన్లను తలపిస్తాయి గనుక, మోటార్‌ వాహనాలపై వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. విజిబులిటీ తక్కువగా ఉంటుంది గనుక, అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీలైనంతవరకు ప్రయాణాలు తగ్గించుకోవాలని వాహనదారులకు వాతావరణ శాఖ సూచించింది.

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com