షీ టీమ్ స్కూటీలను,అంబులెన్సును ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్
- May 20, 2021
హైదరాబాద్: లాక్‌డౌన్ ఎలా ఉందో చూడటానికి, సరదాగా తిరగడానికి రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు ఉంటాయని...ఈ రోజు నుండి చెక్ పోస్టుల దగ్గర మరింత కఠినంగా తనిఖీలు ఉంటాయని సీపీ మహేష్ భగవత్ హెచ్చరించారు. గురువారం రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 షీ టీమ్ స్కూటీలను , ఒక అంబులెన్సును సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం మహిళల భద్రత కోసం షీ టీంలను ఏర్పాటు చేశారన్నారు. 2016 నుండి ఈ షీ టీంలు పని చేస్తున్నాయని తెలిపారు. మన దేశంలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళా భద్రతకు కేంద్రం నిధులు ఇస్తుందని ఆయన చెప్పారు. హోండా అక్టీవ్ 16 బండ్లను ఓపెన్ చేశామని... ఈ వెహికల్స్ వల్ల మహిళలకు మరింత భద్రత ఉంటుందన్నారు. ఆకతాయిల ఆట పట్టచ్చని, మహిళలకు మరింత చేరువ అవ్వచ్చని తెలిపారు. ప్రస్తుతం అంబులెన్సు వినియోగం పెరిగిందన్నారు. అందుకే తమ దగ్గర ఉన్న పాత వెహికల్‌ను రిపేర్ చేయించి అన్ని సౌకర్యాలతో ఈ రోజు ప్రారంభించామని ఆయన చెప్పారు. 24/7 అందుబాటులో ఉండే అంబులెన్సులు తమ పరిధిలో ఉన్నాయన్నారు. ప్రైవేటు కంపెనీల వారు కూడా తమకు అంబులెన్సులు స్పాన్సర్ చేస్తున్నారని అన్నారు. అంబులెన్సు వారు అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వస్తే వెంటనే తమ టీం పట్టుకొని డబ్బులు పేషెంట్లకు రిటర్న్ ఇచ్చారని అన్నారు. అంబులెన్సులను డబ్బుల కోసం వ్యాపారం దృష్టిలో చూడకూడదని సీపీ తెలిపారు.

ఉదయం 10 తర్వాత చాలా పకడ్భందిగా లాక్‌డౌన్ అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 21 వేల కేసులు నమోదు అయ్యాయని, 6000 వరకు మాస్కులు లేని కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ పాస్ అప్లై చేస్తే ఎమర్జెన్సీని బట్టి మూడు రోజుల కోసం పాస్ ఇవ్వబడుతుందన్నారు. ఈ పాస్ కోసం సమాచారం, ఆధారాలు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌లో ప్రజల సహకారం అవసరమన్నారు. 30 వరకు అందరు సహకరించాలని కోరారు. ట్రక్ డ్రైవర్లకు, ఉచిత ఆహారం అందిస్తున్నారని అన్నారు. ఎమర్జెన్సీ వెహికల్స్‌కు ఎవరు కూడా ఇబ్బంది కల్గించవద్దని తెలిపారు. మానసికంగా సమస్యలు ఉన్నవారు కూడా రాచకొండ కమిషనరేట్‌కు కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చన్నారు. బాల్య వివాహాలు జరిపితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెమిడెసివర్ ఇంజక్షన్‌లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ‘‘ఎవరైనా సరే మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి...ఏ ఎమర్జెన్సీ సమస్య ఉన్నా మా ఆఫీస్‌కు 9490617111 కాల్ చేయచ్చు’’ అని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు.

తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







