నిషేధం ఎత్తివేత తర్వాత 36 గంటల్లో 18,680 మంది పౌరుల విదేశీ ప్రయాణం

- May 21, 2021 , by Maagulf
నిషేధం ఎత్తివేత తర్వాత 36 గంటల్లో 18,680 మంది పౌరుల విదేశీ ప్రయాణం

సౌదీ: అంతర్జాతీయ ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం ఎత్తివేసిన తర్వాత ఒక్కసారిగా కింగ్డమ్ నుంచి విదేశీ ప్రయాణాలు భారీగా నమోదయ్యాయి. భూ సరిహద్దులు, విమానాశ్రయాల ద్వారా నిషేధం ఎత్తివేసిన తొలి 36 గంటల్లోనే 18,680 మంది సౌదీ పౌరులు విదేశాలకు వెళ్లినట్లు కింగ్డమ్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో తొలి 24 గంటల్లో 10,450 మంది ప్రయాణించారని తెలిపారు. విమానాల్లో విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లారని, ఆ తర్వాత ఈజిప్ట్, ఖతార్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. 5,717 మంది పౌరులు భూ సరిహద్దుల మీదుగా పొరుగు దేశాలకు వెళ్లారని వెల్లడించారు. మొత్తం 3,362 మంది కింగ్ ఫహద్ కాజ్‌వేను బహ్రెయిన్‌కు వెళ్లడానికి ఉపయోగించగా, 689 మంది అల్-బాతా సరిహద్దు క్రాసింగ్ ద్వారా యుఎఇకి బయలుదేరినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 673 మంది సౌదీలు అల్-హదీతా చెక్ పాయింట్ గుండా జోర్డాన్ చేరుకోగా, 324 మంది ఖతార్ సాల్వా చెక్ పాయింట్ దాటి బయలుదేరారు, 270 మంది ఖాఫ్జీ సరిహద్దు క్రాసింగ్ ద్వారా కువైట్ వెళ్లినట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com