హోం క్వారంటైన్ రూల్స్ బ్రేక్..10 మంది అరెస్ట్
- May 21, 2021
దోహా: ఖతార్ లో హోం క్వారంటైన్ నిబంధనలు పాటించని పది మందిని సంబంధిత అధికారులు అరెస్ట్ చేశారు.హోం క్వారంటైన్ గడువు ముగిసే వరకు ఆయా వ్యక్తులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంది.కానీ, అరెస్టైన పది మంది నిబంధనలకు విరుద్ధంగా తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని పేర్కొన్న అధికారులు వారిని తదుపరి విచరాణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు.సమాజంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య భద్రత తమకు ముఖ్యమేనన్న అధికారులు..దేశంలోని పౌరులు, ప్రవాసీయులు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. తమ ఆరోగ్యంతో పాటు తోటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేలా ప్రవర్తించొద్దని పిలుపునిచ్చారు.హోంక్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి అరెస్టైన పది వివరాలను కూడా సంబంధిత అధికారులు వెల్లడించారు.
1.సయీద్ మహ్మద్ హమద్ అల్ గఫ్రానీ అల్ మర్రి
2.సేలం రషీద్ హమద్ సెద్ అల్ అట్రాక్
3.జాన్ ఫిలిప్ పాడిలా వర్చుసో
4.మహ్మద్ హరౌన్ మాయన్
5.క్వేస్ అహ్మద్ అబ్దుల్నౌర్
6.ఒమర్ అలీ ఒమర్
7.సల్మాన్ ఫేర్స్ మొహెల్దిన్
8.అతేఫ్ యూసఫ్ అల్ డెరెరి
9.అబ్దుల్‌మలెక్ సౌఫన్
10.రత్న పిటా అరెస్టైన వారిలో ఉన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







