18 ఏళ్లు నిండి, వ్యాక్సిన్ తీసుకున్న వారికే మసీదుల్లోకి అనుమతి
- May 21, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్న బహ్రెయిన్ నేషనల్ టాస్క్ ఫోర్స్ మసీదుల్లోకి భక్తుల అనుమతికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి వ్యాక్సిన్ తీసుకున్న 18 ఏళ్లకు పైబడిన వారిని మాత్రమే ప్రార్థనలకు అనుమతించనున్నట్లు ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ మంత్రిత్వశాఖ ప్రకటించింది.దీనికి సంబంధించి సున్నీ, జాఫరీ ఎండోమెంట్ లతో సమీక్షించిన తర్వాత జాతీయ టాస్క్ ఫోర్స్ సూచనలకు అనుగుణంగా ప్రస్తుత నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శుక్రవారం ప్రార్థనలతో పాటు తక్కిన రోజుల్లోనూ రోజువారీ ప్రార్థనల సమయంలో భక్తులను పరిమిత సంఖ్యకు కట్టడి చేసేందుకు వీలుగా చేపట్టిన ఈ చర్యలు శుక్రవారం(మే 21) నుంచే అమలులోకి రానున్నాయి. అంటే ఇవాల్టి నుంచి మసీదుల్లో ప్రార్థనలకు వెళ్లే వారు రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకొని 14 రోజులు పూర్తి అయి ఉండాలని. బీఅవేర్ బహ్రెయిన్ యాప్ https://apps.apple.com/bh/app/beaware-bahrain/id1501478858 లో గ్రీన్ లోగో ఉన్నవారిని మాత్రమే ప్రార్థనలకు అనుమతిస్తారు.ఇస్లామిక్ వ్యవహారాలు,ఎండోమెంట్ మినిస్ట్రీ తీసుకున్న నిర్ణయాన్ని అమలుకు సంబంధించి సున్నీ, జాఫరీ ఎండోమెంట్ డైరెక్టరేట్లు పర్యవేక్షిస్తాయి.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







