ఆనందయ్య కరోనా మందు పరిశీలనకు వైద్యుల బృందం!
- May 23, 2021
నెల్లూరు: సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ పరిశోధనలు చేస్తున్నాయి. ఈ మందుపై శాస్త్రీయ నిర్ధారణ కోసం కేంద్ర ఆయుర్వేదిక్ పరిశోధనా సంస్థ వైద్యులు సోమవారం కృష్ణపట్నం చేరుకోనున్నారు. వారు స్వయంగా మందును పరిశీలించి అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా కరోనా మందును పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం మందు పంపిణీ పూర్తిగా ఆగిపోయింది.
ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుపై పూర్తి నమ్మకం ఉందని గ్రామస్థులు మరోసారి స్పష్టంచేశారు. తమ గ్రామంలో కరోనా లేదని, ఆనందయ్య మందువల్లే సాధ్యమైందని చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ప్రజలందరికీ పంపిణీ చేస్తామని అంటున్నారు. మరోవైపు, శాస్త్రీయత, సామర్థ్యం నిరూపణ అయ్యేంతవరకు కృష్ణపట్నం ఔషధ పంపిణీని నిలిపివేయాలని జన విజ్ఞాన వేదిక, ప్రజా ఆరోగ్య వేదిక సభ్యులు కోరారు. నిబంధనలు పాటించకుండా మందు పంపిణీ చేసి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







