వచ్చే విద్యా సంవత్సరం నుంచి డైరెక్ట్ క్లాసెస్

- May 27, 2021 , by Maagulf
వచ్చే విద్యా సంవత్సరం నుంచి డైరెక్ట్ క్లాసెస్

సౌదీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వాహణకు సంబంధించి సౌదీ ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. కోవిడ్ పరిస్థితులకు ఎదుర్కొని మళ్ళీ సాధారణ వాతావరణంలో స్కూల్, కాలేజీ, వర్సిటీలలో క్లాసుల నిర్వహణ విధానాలను ప్రకటించింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి బోధనా సిబ్బందిలోని ప్రతీ ఒక్కరు తరగతులకు ఫిజికల్ గా అటెండ్ అవ్వాల్సి ఉంటుందని విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే కోవిడ్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అందరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ప్రాధాన్యత ఉందని సూచించింది. తవక్కల్న, తబౌద్ యాప్ ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే ఆయా సిబ్బందిని విద్యా సంస్థల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com