అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

- May 28, 2021 , by Maagulf
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరో నెల పాటు పొడిగించింది. జూన్ 30వ తేదీ వరకూ ఈ నిషేధం పొడిగించినట్టు డీజీసీఏ శుక్రవారంనాడు ప్రకటించింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. కోవిడ్ కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలకు అవరోధం లేకుండా  పలు దేశాలతో ఇండియా చేసుకున్న ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం పలు అంతర్జాతీయ విమానాల ఆపరేషన్ జరుగుతోంది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ఇండియా ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com