హీరో నిఖిల్ తన అసిస్టెంట్ ఓ బైక్ ను కొనిచ్చాడుకు...

- March 06, 2016 , by Maagulf
హీరో నిఖిల్  తన అసిస్టెంట్  ఓ బైక్ ను కొనిచ్చాడుకు...

టాలీవుడ్ హీరోలు తమ అభిమానాన్ని గిఫ్ట్ ల రూపంలో చూపిస్తున్నారు. అయితే ఇటీవల కాలం సినిమా మార్కెట్ భారీగా పెరగటంతో గిఫ్ట్ ల రేంజ్ కూడా అదే స్థాయిలో పెరిగింది. శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకి కారును గిఫ్ట్ గా ఇచ్చాడు మహేష్ బాబు. అదే దర్శకుడితో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ కూడా ఓ కాస్ట్ లీ వాచ్ ను కొరటాలకు గిఫ్ట్ ఇచ్చాడు. ఇలా తమ ఆనందాన్ని గిఫ్ట్ ల రూపంలో పంచుకుంటున్నారు స్టార్స్.తాజాగా ఇదే లిస్ట్ లో మరో యంగ్ హీరో కూడా చేరిపోయాడు. తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి కోసం ఓ బైక్ ను కొనిచ్చాడు యంగ్ హీరో నిఖిల్. అంతేకాదు తానే ఆ బైక్ మీద కూర్చొని ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇటీవల శంకరాభరణం సినిమాతో నిరాశపరిచిన నిఖిల్ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com