ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి మళ్లీ బ్లూ బ్యాడ్జ్
- June 05, 2021
న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి మళ్లీ బ్లూ బ్యాడ్జ్ వేసేసింది ట్విట్టర్.అసలేమైందంటే... ఈ ఉదయం వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి ఉన్న బ్లూ బ్యాడ్జిని తొలగించింది ట్విట్టర్.ఈ బ్యాడ్జి ఉంటేనే... అది నిజమైన అకౌంట్ అని నెటిజన్లు గ్రహించగలరు. బ్యాడ్జ్ లేని అకౌంట్ నిజమైనదో,నకిలీదో గుర్తించడం కష్టం.అందువల్ల బ్యాడ్జ్ తొలగించడంపై పెద్ద దుమారం రేగింది. ట్వట్టర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని గమనించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం...ఎందుకు తొలగించారని ట్విట్టర్ యాజమాన్యాన్ని వివరణ కోరింది. దాదాపు ఏడాది కాలంగా...ఆ ఎకౌంట్ యాక్టివ్‌గా లేదనీ... అందువల్లే బ్యాడ్జి తొలగించామని ట్విట్టర్ చెప్పింది.ఐతే...వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక...తన సమాచారం అంతా...అధికారిక ఉపరాష్ట్రపతి కార్యాలయ అకౌంట్ నుంచి పంపుతున్నారనీ... అంత మాత్రాన...యాక్టివ్‌గా లేనట్లు కాదని...చెప్పడంతో...ట్విట్టర్...తన తప్పును సరిచేసుకుంది. మళ్లీ బ్లూ బ్యాడ్జ్ వేసేసింది.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి... చివరిసారిగా గతేడాది జులై 23న ఓ ట్వీట్ వచ్చింది. ఆయన అకౌంట్‌కి 13 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. అదే సమయంలో...ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారిక అకౌంట్‌కి 9,31,000 ఫాలోయర్స్ ఉన్నారు.వెంకయ్యనాయుడు పర్సనల్ అకౌంట్‌కి వెరిఫైడ్ బ్లూ బ్యాడ్జిని తొలగించడం ద్వారా... పెను దుమారానికి తెరతీసిన ట్విట్టర్.
తాజా వార్తలు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు