అరెస్ట్ అయినాక పారిపోతే అదనంగా రెండేళ్ల జైలు శిక్ష
- June 05, 2021
యూఏఈ: ఏ నేరంలోనైనా నిందితులుగా అరెస్టైన వ్యక్తులు పారిపోవటానికి ప్రయత్నిస్తే అదనపు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. అరెస్టు సమయంలో పారిపోయినా, పోలీసుల అదుపులో నుంచి తప్పించుకున్నా రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు వెల్లడించింది.దీంతో పాటు కస్టడీకి కూడా అప్పగించేందుకు అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక వీడియోను విడుదల చేసింది. ఇద్దరు లేదా అంతకుమించి వ్యక్తులు నేరానికి పాల్పడినప్పుడు, బెదిరింపులు, విధ్వంసాలకు పాల్పడిన కేసుల్లో పెనాల్టి జైలు శిక్ష రూపంలో ఉంటుందని స్పష్టం చేసింది.నేర తీవ్రత, ఉపయోగించిన ఆయుధాలను బట్టి ఐదేళ్లకు మించకుండా జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!