వ్యాక్సిన్ తో కరోనా ముప్పు తక్కువగా ఉంటుంది: ఎయిమ్స్
- June 05, 2021_1622878577.jpg)
న్యూ ఢిల్లీ: వ్యాక్సిన్ తో కరోనా ముప్పు తక్కువగా ఉంటుంది. ఒక డోసు తీసుకున్న వారిలో కరోనా సోకినా తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇక రెండు డోసులు తీసుకుంటే మరణ ముప్పు తక్కువగా ఉంటుందని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సోకిన 63 మంది రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ నిపుణులు గమనిస్తూ వచ్చారు. వీరిలో 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక్కడోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందులో 53 మంది కోవాగ్జిన్, 10 మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
రెండు డోసులు తీసుకున్న వారిలో 52.8శాతం మంది, ఒక్క డోసు తీసుకున్న వారిలో 47.2 శాతం మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారు.వీరికి 5 నుంచి 7 రోజుల పాటు జ్వరం వచ్చినా, తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు లేవని నిపుణులు గుర్తించారు.అయితే టీకా వేయించుకున్నా మాస్కులు ధరించడం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యం. వైరస్ పై పోరాటంలో టీకా ఒక ఆయుధమని ఎయిమ్స్ నిపుణులు వివరించారు. కరోనా ఒకరినుంచి మరొకరికి సంక్రమించే వైరస్ కాబట్టి కోవిడ్ వచ్చిన వారు మిగిలిన వారితో కలవకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!