బాప్స్ హిందూ మందిర్ నుంచి భారత్ కు 2000 ఆక్సిజన్ సిలిండర్లు

- June 06, 2021 , by Maagulf
బాప్స్ హిందూ మందిర్ నుంచి భారత్ కు 2000 ఆక్సిజన్ సిలిండర్లు

అబుధాబి: కోవిడ్ సెకండ్ వేవ్ తో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్న భారత్ కు తొలి నుంచి తమ వంతు సాయం అందిస్తున్న బాప్స్ హిందూ మందిర్...లేటెస్ట్ గా మరో 2,000 ఆక్సిజన్ సిలిండర్లను సాయంగా అందించింది.అబుధాబిలోని తొలి హిందూ ఆలయమైన బాప్స్ మందిర్..భారత్ లోని పరిస్థితులు చూసి చలించిపోయింది. తమ వంతు సాయంగా ఆక్సిజన్ సిలిండర్లు, లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందించనున్నట్లు గత ఏప్రిల్ లోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఇప్పటివరకు  132 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, 2,000 ఆక్సిజన్ సిలిండర్లు, 1,000 ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందించినట్లు బాప్స్ హిందూ మందిర్ ప్రతినిధులు వెబినార్ ద్వారా వెల్లడించారు. యూఏఈ, భారత్ లోని తమ వాలంటీర్లు సహాయ కార్యక్రమాలను, వైద్య పరికరాల అందజేయటం విషయంలో సమన్వయం చేసుకుంటూ సేవలు అందిస్తున్నారు. భారత్ లోని 235 ఆస్పత్రులతో పాటు తమ సేవా కేంద్రాల ద్వారా బాప్స్ హిందూ మందిర్ ప్రజలకు సేవలు అందిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుకుంటోంది. ప్రతి వారం ఓ గొలుసుకట్టు విధానంలో విడతల వారీగా 235 ఆస్పత్రులకు ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు అందిస్తూ కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొవటంలో భారత్ కు తమ వంతు సాయం అందిస్తోంది.అలాగే బాప్స్ స్వామినారయణ్ సంస్థ తమ సేవా కేంద్రాల ద్వారా అన్నదానం, బ్లాంకెట్లు, వైద్య పరికరాల పంపిణీ కొనసాగిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com