పునఃప్రారంభం, జీసీసీ క్వారంటైన్ పాలసీతో ‘మాల్స్’కి ఉత్సాహం: ఎంఓక్యు జీఎం
- June 08, 2021
ఖతార్: క్రమంగా కోవిడ్ 19 నిబంధనల్ని సడలిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక రంగం వేగంగా కోలుకోవడానికి ఉపకరిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సినేషన్ పొందిన జీసీసీ ప్రాంతీయులకి క్వారంటైన్ అవసరం లేకుండా ఖతార్ వచ్చేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకోవడం ఖతార్ రిటెయిల్ ఫుడ్ మరియు బెవరేజ్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందడానికి ఆస్కారం కలిపిస్తాయి. నాలుగు ఫేజుల్లో రీ-ఓపెనింగ్ మొదలు కానుంది. మే 28 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మాల్ ఆఫ్ ఖతార్ జనరల్ మేనేజర్ ఎమిలీ సార్కిస్ మాట్లాడుతూ, ఖతార్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, ఆర్థిక రంగం కోలుకోవడానికి ఉపకరిస్తుందని అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తీసుకున్న తాజా నిర్ణయాల ప్రకారం జిసిసి పౌరులు వ్యాక్సినేషన్ తీసుకున్నట్లయితే, అలా వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత వారికి ఎలాంటి క్వారంటైన్ అవసరం వుండదు ఖతార్ రావడానికి. గడచిన తొమ్మిది నెలల్లో కరోనా బారిన పడి, ఆ తర్వాత ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఇదే వర్తిస్తుంది. అలాంటి వారు పిసిఆర్ నెగెటివ్ టెస్ట్ తమతో తీసుకురావాలి. ఎహ్తెరాజ్ యాప్ ద్వారా తమ ఇమ్యునిటీ స్టేటస్ వినియోగదారులు మాల్స్ ప్రవేశం వద్ద చూపించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







