హైదరాబాద్ మెట్రో సేవల సమయం పెంపు
- June 09, 2021
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..సడలింపుల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కొత్త సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.మొత్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు ఉండనుండగా..మరో 12 గంటల పాటు..సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఇక, లాక్డౌన్ సడలింపుల సమయం పెరగడంతో.. తన సేవల సమయాన్ని కూడా పొడిగించింది హైదరాబాద్ మెట్రో రైలు..ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో సేవలను కొనసాగనున్నట్టు ప్రకటించారు.అయితే, అన్ని చివరి స్టేషన్ల నుంచి సాయంత్రం 5 గంటలకు చివరి రైలు బయల్దేరుతుంది.పొడింగించిన సమయం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు.
_1623247370.jpg)
కె.వి.బి రెడ్డి(MD & CEO,L&T Metro Rail,Hyderabad)మాట్లాడుతూ... ప్రతి ఒక్కరి భద్రత కోసం, ప్రయాణీకులు సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, రెగ్యులర్ హ్యాండ్ శానిటైజేషన్ మరియు థర్మల్ స్క్రీనింగ్ వంటి COVID-19 భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది మరియు హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బందితో సహకరించాలని అభ్యర్థించారు.
_1623247390.jpg)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







