హైదరాబాద్ మెట్రో సేవల సమయం పెంపు

- June 09, 2021 , by Maagulf
హైదరాబాద్ మెట్రో సేవల సమయం పెంపు

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..సడలింపుల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కొత్త సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.మొత్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు ఉండనుండగా..మరో 12 గంటల పాటు..సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఇక, లాక్‌డౌన్‌ సడలింపుల సమయం పెరగడంతో.. తన సేవల సమయాన్ని కూడా పొడిగించింది హైదరాబాద్ మెట్రో రైలు..ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో సేవలను కొనసాగనున్నట్టు ప్రకటించారు.అయితే, అన్ని చివరి స్టేషన్ల నుంచి సాయంత్రం 5 గంటలకు చివరి రైలు బయల్దేరుతుంది.పొడింగించిన సమయం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు.

కె.వి.బి రెడ్డి(MD & CEO,L&T Metro Rail,Hyderabad)మాట్లాడుతూ... ప్రతి ఒక్కరి భద్రత కోసం, ప్రయాణీకులు సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, రెగ్యులర్ హ్యాండ్ శానిటైజేషన్ మరియు థర్మల్ స్క్రీనింగ్ వంటి COVID-19 భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది మరియు హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బందితో సహకరించాలని అభ్యర్థించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com