సాగునీటి ఒప్పందాల కోసం ముంబయి బయలుదేరిన కేసీఆర్‌

- March 07, 2016 , by Maagulf
సాగునీటి ఒప్పందాల కోసం ముంబయి బయలుదేరిన  కేసీఆర్‌

మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ఒప్పందాల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారులతో కూడిన బృందం ముంబయి బయలుదేరి వెళ్లింది. కేసీఆర్‌ వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్‌, విద్యాసాగరరావు, సీఎస్‌ రాజీవ్‌శర్మ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, అధికారులు ఉన్నారు. ఈ పర్యటనలో మేడిగడ్డ సహా 5 బ్యారేజీల నిర్మాణానికి ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోనున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌తో రేపు ఉదయం కేసీఆర్‌ భేటీ అవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com