'పోకిరి రాజా త్వరలో తెలుగులో..

- March 07, 2016 , by Maagulf
'పోకిరి రాజా త్వరలో తెలుగులో..

 తమిళనటుడు జీవా, హన్సిక జంటగా నటించిన చిత్రం 'పోకిరి రాజా'. తాజాగా తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు నటుడు జీవా తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుగు ప్రేక్షకులకు వెల్లడించారు. అంతేకాకుండా చిత్ర తెలుగు పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ 'మహాశివరాత్రి శుభాకాంక్షలు' తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలో ఆడియోను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. రామ్‌ప్రకాశ్‌ రాయప్ప దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇమాన్‌ సంగీతాన్ని సమకూర్చారు.తమిళనాడులోని పెరంబుదూర్‌ ధనలక్ష్మి శ్రీనివాసన్‌ కళాశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హన్సిక, జీవాలు సందడి చేశారు. జీవా తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. చిత్రంలోని 'బబ్లీబబ్లీ' అనే పాటకు నృత్యం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 40 వేల మంది హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com