కువైట్ నుంచి భారత్ కు 8000 ఆక్సిజన్ సిలిండర్లు
- June 14, 2021
కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు భారత్ బాసటగా నిలిచిన కువైట్..మరో విడతగా ఆక్సిజన్ సిలిండర్లను పంపుతోంది. కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీ సౌజన్యంతో 8000 ఆక్సిజన్ సిలిండర్లను షువైఖ్ నౌకాశ్రయం నుంచి తరలిస్తున్నారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శార్దూల్ ద్వారా నేవీ బృందం ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లనుంది. కువైట్లోని భారత రాయబారి సిబి జార్జ్, కువైట్ పోర్ట్స్ అథారిటీ జనరల్ డైరెక్టర్ షేక్ యూసుఫ్ అబ్దుల్లా అల్ సబా, పబ్లిక్ అథారిటీ ఆఫ్ ఇండస్ట్రీ జనరల్ డైరెక్టర్ అబ్ధుల్ కరీం అల్ తకీ ఆక్సిజన్ సిలిండర్ల తరలింపునకు సంబంధించి అధికారిక ప్రక్రియను పూర్తి చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కోనేందుకు కువైట్ ముందు నుంచి భారత్ కు బాసటగా నిలుస్తోంది. కువైట్లోని భారతీయులు తమ వంతు సాయం అందిస్తుండటంతో ఇప్పటికే పలు
విడతలుగా ఆక్సిజన్ సిలిండర్లు, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఇతర వైద్య పరికాలను పంపించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









