నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్: సీపీ సజ్జనార్
- June 18, 2021
హైదరాబాద్: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ తెలిపారు.ఈ ముఠాకు సూత్రధారి అయిన ఆదినారాయణమూర్తికి తొమ్మిది రియల్ ఎస్టేట్ కంపెనీలున్నాయని చెప్పారు. కనపడిన ఖాళీ భూములన్నింటికీ పత్రాలు సృష్టించి వేరేవారికి అమ్మడమే వీరి ప్రధాన వృత్తి అని వెల్లడించారు. మహేశ్వరంలో 40 ఎకరాల భూమిని కూడా ఇలాగే వేరేవారికి విక్రయిస్తున్నారని, కొనుగోలుదారుడు అడిగిన అసలు పత్రాలను మొబైల్లో పంపించారని,వాటి పై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు సీపీ వివరించారు.ఎకరానికి రూ.1.4 కోట్ల లెక్కన రూ.56 కోట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, వీరి దగ్గర నుంచి నకిలీ పత్రాలు, మహబూబ్‌నగర్ ఆర్డీవో,ఎమ్మార్వో పేరుతో రెవెన్యూ స్టాంపులు,51 పట్టాదారు పాసు పుస్తకాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ తెలియజేశారు.


తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







